Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 18 2015 @ 19:59PM

అసెంబ్లీలో గొడవకు కాల్వ శ్రీనివాసులే కారణం
రాజకీయంగా ఇరుకున పెట్టేందుకే దృశ్యాల విడుదల
టీడీపీ సభ్యుల మాటలు విడుదల చేయలేదేం? : రోజా

హైదరాబాద్‌, మార్చి 18: అసెంబ్లీలో గొడవకు కాల్వ శ్రీనివాసులే కారణమని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. అసెంబ్లీలో నేడు చోటుచేసుకున్న ఘటనలపై ఏబీఎన్‌తో రోజా మాట్లాడారు. చీఫ్‌ విప్‌ అంటే చీప్‌గా మాట్లాడటమే అనుకుంటున్నారేమోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయనలా మామకు వెన్నుపోటుపొడిచి రాజకీయాల్లోకి రాలేదని, కష్టపడి రాజకీయనాయకురాలిగా, ఆర్టిస్ట్‌గా ఎదిగానన్నారు. ‘ఒళ్లు పెంచడం కాదు.. బుర్ర పెంచాలని’ మంత్రి పీతల సుజాతనుద్దేశించి అన్నానని రోజా వివరించారు.

రాజకీయంగా తమను ఇరుకున పెట్టేందుకే అధికారపక్షం సభలో జరిగిన దృశ్యాలను విడుదల చేసిందని రోజా ఆరోపించారు. టీడీపీ సభ్యులు మాట్లాడిన దృశ్యాలు ఎందుకు విడుదల చేయలేదని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీలో విపక్షానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కనీస గౌరవం ఇవ్వడం లేదని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.