Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Nov 22 2014 @ 00:37AM

గెలుపోటములు సహజం ఎమ్మెల్సీ పొంగులేటి సీఎస్‌ఏ దక్షిణభారత టోర్నీ షురూ

ఖమ్మం సంక్షేమ విభాగం : క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అందువల్ల ఓటమి తో కుంగిపోకుండా విజయానికి మరింత కృషి చేయాలని సూచించారు. స్థానిక సెయింట్‌జోసఫ్‌ పాఠశాలలో మూడురోజులపాటు జరుగనున్న సీఎస్‌ఏ 15వ దక్షిణ భారత క్రీడా టోర్నమెంట్‌ను ఆయన శుక్రవారం రాత్రి ప్రారంభించారు. క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, రెవరెండ్‌ సిస్టర్‌ రోజ్‌రిండా అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. క్రీడలు దేహదారుఢ్యాన్ని పెంచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, అందుకే ప్రతీ ఒక్కరూ ఆటలు ఆడాలన్నారు. అనంతరం క్రీడాకారుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
టోర్నమెంట్‌లో భాగంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా సెయింట్‌జోసఫ్‌ పాఠశాల విద్యార్థినులు 127 మంది స్వాగతం అంటూ ప్రదర్శించిన జానపద నృత్యం కార్యక్రమాలకు హైలైట్‌గా నిలిచింది.
ఆకట్టుకున్న మార్చ్‌పాస్ట్‌
టోర్నమెంట్‌ ప్రారంభం సందర్భంగా 26 జిల్లాలకు చెందిన జట్లు చేసిన మార్చ్‌పాస్ట్‌ విశేషంగా ఆకట్టుకుంది. మార్చ్‌పాస్ట్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విజయమేరీ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌ నూతన్‌కల్‌ (నల్లగొండజిల్లా), విస్సన్నపేట, ప్రసాదంపాడు (కృష్ణాజిల్లా) పాఠశాలలకు బహుమతులు అందజేశారు. మూడురోజులపాటు పగలు, రాత్రివేళల్లో కూడా జరిగే ఈ పోటీల్లో భాగంగా శుక్రవారం రాత్రి కోదాడ ఖమ్మం జట్ల మధ్య బాస్కెట్‌బాల్‌ పోటీని పొంగులేటి ప్రారంభించారు. వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, త్రోబాల్‌ తదితర ఈవెంట్లలో పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో కె.రవీంద్రనాధ్‌రెడ్డి, కబీర్‌దాస్‌, రెవరెండ్‌ సిస్టర్‌ జపమాల, జాన్‌పాల్‌, శౌరులు, సెయింట్‌జోసఫ్‌ పాఠశాల హెడ్‌మిసె్ట్రస్‌ నక్షత్రం, రెవరెండ్‌ శౌరి తదితరులు పాల్గొన్నారు.