Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Nov 22 2014 @ 00:34AM

26, 27న గవర్నర్‌ తిరుమల పర్యటన

చిత్తూరు అర్బన్‌: ఏపీ, తెలంగాణ సంయుక్త రాషా్ట్రల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహాన్‌ ఈనెల 26, 27న కుటుంబసభ్యులతో తిరుమల పర్యటనకు రానున్నట్లు జేసీ భరత్‌గుప్త శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26న చెన్నై నుంచి ఆయన రోడ్డుమార్గంలో బయలుదేరి సాయంత్రం 6.15 గంటలకు తిరుమల చేరుకుంటారన్నారు. రాత్రి పద్మావతి అతిథిగృహంలో బసచేస్తారని తెలిపారు. 27న ఉదయం సమయం రిజర్వులో ఉండగా, మధ్యాహ్నం 2.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని పేర్కొన్నారు. 3.35 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరుతారని వివరించారు.