Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 9 2014 @ 14:04PM

ఈనెల 14న కడప విమానాశ్రయం ప్రారంభం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 9 : కడపలో నూతన విమానాశ్రయాన్ని ఈ నెల 14న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు తదితరులు పాల్గొంటారని అధికారవర్గాలు తెలిపాయి. 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు నూతన విమానాశ్రయ ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 6 వేల అడుగుల రన్‌వేతో ప్రారంభమయ్యే ఈ విమానాశ్రయాన్ని అతి త్వరలో 9 వేల అడుగులకు విస్తరిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏటీఆర్‌(రవాణా) విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తాయని వారు తెలిపారు. హైదరాబాద్‌ - కడప - ఢిల్లీ మధ్య విమానాలను నడిపేందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యంతో సంప్రదింపులు జరుగుతున్నాయని వివరించారు.