desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 9 2014 @ 11:50AM

టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ షాక్‌
టీఆర్‌ఎస్‌లో చేరిన తలసాని, తీగల, ప్రకాష్‌, ధర్మారెడ్డి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 : తెలుగుదేశం పార్టీకి నలుగురు టీటీడీపీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ షాక్‌ ఇచ్చారు. టీటీడీ సీనియర్‌ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్‌, ధర్మారెడ్డితో పాటు ఎమ్మెల్సీ గంగాధర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఎమ్మెల్యేలు ప్రకటించారు.
 
అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కరెంట్‌ కష్టాలకు చంద్రబాబే కారణమని విమర్శించారు. టీటీడీపీలో నాయకులు ఎవరూ లేనట్టు తెలంగాణలో పార్టీ బాధ్యతలను లోకేష్‌కు అప్పగించాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ సమావేశాలంటూ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. హైదరాబాద్‌ ఖ్యాతిని అంతర్జాతీయం చేయడంలో కేసీఆర్‌కు అండగా ఉంటామన్నారు.