Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 21:39PM

చైనాలో భారీ భూకంపం.. తీవ్రత 6.7గా నమోదు

బీజింగ్: చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.7గా నమోదైంది. నిమిషం పాటు భూమి కంపించింది. దీంతో జనం ఇళ్లనుంచి పరుగులు తీశారు. కిర్గిజ్‌స్థాన్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది.