Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 12:36PM

ప్రజాస్వామ్య బద్ధంగా రెండేళ్ల ఎన్డీఏ పాలన : కేంద్రమంత్రి

హైదరాబాద్ : ప్రజాస్వామ్య బద్ధంగా రెండేళ్ల ఎన్డీఏ పాలన కొనసాగిందని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజూ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... బీజేపీయేతర రాష్ట్రాల్లో కేంద్ర నిధులు ప్రజలకు చేరడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజలకు చేరాలన్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి బాధాకరమరని, ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపి ఎమర్జెన్సీ విధించిన రోజును ఎవరూ మర్చిపోరని, ఎమర్జెన్సీ సమయంలో జరిగిన వాస్తవాలు ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు.