Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 11:31AM

మానసిక రోగిలా వ్యవహరిస్తున్న జగన్ : దేవినేని

విజయవాడ : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నాడని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... సాగునీటి ప్రాజెక్ట్‌లపై జగన్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేస్తూ మండిపడ్డారు. అయితే... ప్రాజెక్ట్‌ల పూర్తికి తమ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలకు జన్ స్వస్తి పలకాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజాయతీగా పనిచేస్తున్నాడని మంత్రి పేర్కొన్నారు.