Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 11:06AM

హోంమంత్రి అధ్యక్షతన బోనాల ఉత్సవాల కమిటీ భేటీ

హైదరాబాద్‌ : రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షతన బోనాల ఉత్సవాల కమిటీ సమావేశం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో జరిగింది. కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డ తర్వాత తొలిసారిగా సమావేశమైన కమిటీ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించింది. గత సంవత్సరం నిర్వహించిన ఉత్సవాల మాదిరిగానే పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, అలంకరణ తదితర అంశాల్లో మరింత మెరుగ్గా వ్యవహరించాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. మిగిలిన విషయాలను ఈ నెల 27న జరగనున్న ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశంలో చర్చించాలని కమిటీ నిర్ణయించింది. కమిటీ సభ్యులైన ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు టి.పద్మారావు గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డి, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియిద్దీన్‌తోపాటు కార్యదర్శులు ఎన్.శివశంకర్‌, బుర్రా వెంకటేశం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ హరికృష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.