Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 10:09AM

ఉగ్రవాద దాడి : జవాన్లను కోల్పోవడం దిగ్భ్రాంతికరం : మోదీ

న్యూఢిల్లీ : అంకితభావంగల కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) జవాన్లు అమరులుకావడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జమ్మూ-కశ్మీరులోని పాంపోర్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాదులు శనివారం దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో మోదీ తీవ్ర విచారం ప్రకటించారు.
 
జవాన్ల మరణంపై మోదీ ఓ ట్వీట్‌ ద్వారా తన సంతాపాన్ని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జమ్మూ-కశ్మీరులో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్ల ధైర్యసాహసాలకు గౌరవ వందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారు అంకితభావంతో దేశానికి సేవ చేశారన్నారు. వారు అసువులుబాయటంతో తాను తీవ్రంగా బాధపడుతున్నట్లు వివరించారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పాంపోర్ దాడి
ఇద్దరు ఉగ్రవాదులు శనివారం పొంచి ఉండి దాడి చేయడంతో 8 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 24 మంది జవాన్లు గాయపడ్డారు. ఆ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థానీలని, లష్కరే తొయిబా ఉగ్రవాదులని భావిస్తున్నట్లు సీఆర్‌పీఎఫ్ పేర్కొంది.