Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 06:38AM

బాలానగర్ పారిశ్రామిక వాడలో పేలుడు

హైదరాబాద్ : నగరంలోని బాలానగర్ పారిశ్రామిక వాడలో ఆదివారం తెల్లవారుజామున పేలుడు కలకలం సృష్టించింది. ఓబులం ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ దగ్గర పేలుడు సంభవించింది. అబీద్ అనే ఆటోడ్రైవర్ గౌతంనగర్‌ నుంచి అల్యూమినియం మెటీరియల్‌ను తీసుకొచ్చాడు. అయితే... అదే సమయంలో భారీగా పేలుడు సంభవించడంతో ఆయన కాలు నుజ్జునుజ్జు అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పేలుడు దేనివల్ల సంభవించిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.