Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 02:36AM

కాలువలపై నిరంతర నిఘా

  • సమస్యలొస్తే సీఈలదే బాధ్యత
  • క్షేత్రస్థాయిలో ప్రతి ఇంజనీరూ పరిశీలించాలి
  • రైతుల కోసం హైదరాబాద్‌లో కాల్‌సెంటర్‌: హరీశ్‌ 

హైదరాబాద్‌, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన ప్రారంభమైన నేపథ్యంలో పంట నీటి కాలువలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సాగునీటి పారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు సూచించారు. ఎక్కడ కాలువ తెగినా, నీరు లీక్‌ అయినా, రైతులకు సకాలంలో నీరు అందకునా సంబంధిత చీఫ్‌ ఇంజనీర్లే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఏఈఈ నుంచి మొదలు ఎస్‌ఈ, సీఈ వరకు ప్రతి ఇంజనీరూ ప్రాజెక్టుల కింద ఉండే మెయిన కెనాల్స్‌, బ్రాంచి కెనా ల్స్‌, మైనర్‌ కెనాల్స్‌, డిసి్ట్రబ్యూటరీలు, ఫీల్డ్‌ చానెల్స్‌ను పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కాలువల్లోని మట్టి తీయడం, చెట్లు, ముళ్ల పొదలను తొలగించడం, లైనింగ్‌, ఇతరత్రా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కాలువలు, గ్రామ పంచాయతీల వద్ద ఉండే నోటీసు బోర్డులపై ఈఈలు, డీఈఈలు, ఏఈఈల పేర్లు, వారి ఫోన నెంబర్లు రాయాలని తెలిపారు. రైతులు ఫోన చేస్తే వెంటనే స్పందించాలన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల సహాయంతో నీటి లభ్యత, సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలపాలని సూచించారు. ఆయకట్టు మ్యాపులను, రైతుల వివరాలను గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులకు పంపించి, నోటీసు బోర్డుల్లోనూ ప్రదర్శించాలన్నారు. ప్రతి పనికి గడువు విధించుకుని పూర్తి చేయాలన్నారు. గ్రామ పంచాయతీ, డిసి్ట్రబ్యూటరీ స్థాయిల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి, వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. ఇది రైతు ప్రయోజనాల సర్కా రు అని వారికి నమ్మకం కలిగేలా వ్యవహరించాలన్నారు. రైతుల సూచనలు, సలహాలు వినేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు.