Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 01:06AM

ఇంగ్లండ్‌ సూపర్‌ విక్టరీ

  • రాయ్‌, హేల్స్‌ శతకాలు
  • పది వికెట్లతో లంక చిత్తు
బర్మింగ్‌హామ్‌: శ్రీలంకపై టెస్ట్‌ సిరీస్‌ నెగ్గి జోరుమీదున్న ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌లోనూ అదరగొడుతోంది. ఓపెనర్లు జాసన్‌ రాయ్‌ (95 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతో 112 నాటౌట్‌), అలెక్స్‌ హేల్స్‌ (110 బంతుల్లో 10 ఫోర్లు 6 సిక్సర్లతో 133) శతకాలతో విజృంభించడంతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ పదివికెట్ల తేడాతో లంకను చిత్తుచేసింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. టాస్‌గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న పర్యాటక శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. తరంగ (53 నాటౌట్‌), చాందిమల్‌ (52) అర్థశతకాలతో ఆకట్టుకున్నారు. మాథ్యూస్‌ (44), పెరీరా (37) పర్వాలేదనిపించారు. ప్లంకెట్‌, రషీడ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. డేవిడ్‌ విల్లే 1 వికెట్‌ తీశాడు. ఇక కష్టసాధ్యంకాని లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 34.1 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా గెలుపొందింది. ఓపెనర్లు రాయ్‌, హేల్స్‌ తొలి వికెట్‌కు 256 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు ఘనవిజయాన్నందించారు. రాయ్‌, హేల్స్‌కు ఇవే కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు కావడం విశేషం.