Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 01:06AM

జితూ రాయ్‌కి రజతం

బాకు (అజర్‌బైజాన్‌): భారత స్టార్‌ షూటర్‌ జితూ రాయ్‌ షూటింగ్‌ వరల్డ్‌ కప్‌లో రజత పతకం సాధించాడు. శనివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో జితూ రాయ్‌ 199.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం నెగ్గాడు. అతనికి కెరీర్‌లో ఇది ఆరో వరల్డ్‌ కప్‌ పతకం కావడం విశేషం. ఇక బ్రెజిల్‌ షూటర్‌ ఫెలిప్‌ ఆల్మెడా (200.0 పాయింట్లు) స్వర్ణం గెలవగా.. మూడుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ జోంగ్‌ జిన్‌ (కొరియా-178.8) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.