Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 00:51AM

నిర్వాసితులకు పరిహారం చెల్లించేశాం

  • ‘పులిచింతల’పై తెలంగాణ లేఖకు మంత్రి ఉమా స్పందన
గుంటూరు, జూన్ 25(ఆంధ్రజ్యోతి): పులిచింతల ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు గుంటూరు వైపున నష్టపరిహారం చెల్లింపు పూర్తి చేశామని చెప్పారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నుంచి అక్కడి నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారంపై ప్రతిపాదనలు రాగా వెంటనే నిధులు విడుదల చేశామని తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌కు సంబంధించి ఏమైనా బకాయిలుఉంటే విడుదల చేస్తామన్నారు.