desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 00:39AM

నేడు కాపు, బీసీ విద్యోన్నతి పథక ప్రవేశ పరీక్ష

జేఎన్టీయూ(కాకినాడ), జూన్‌25: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాపు విద్యోన్నతి, బీసీ అభ్యర్థులకు అన్న ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథక ప్రవేశ పరీక్షను ఆదివారం ఉదయం 10నుంచి 1గంట వరకు నిర్వహించనున్నామని కాకినాడ జేఎన్టీయూకె కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వీవీ సుబ్బారావు తెలిపారు. ఈ అర్హత పరీక్షను విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, కడప కేంద్రాల్లో నిర్వహిస్తున్నామన్నారు. కాపు, బీసీ సామాజిక వర్గానికి చెందిన 1000 మంది విద్యార్థులను ఈ పథకం కింద ఎంపిక చేసి సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఉచితంగా అందించనున్నామన్నారు. పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించబోమన్నారు.