Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 00:31AM

మరికొన్ని కోర్సులకు కొత్త ఫీజులు ఖరారు

  • బి.ఆర్క్‌కు కనీసం రూ.35వేలు .. గరిష్ఠం రూ.60వేలు
  • బి.ఫార్మసీకి క నీసం రూ.35వేలు .. గరిష్ఠం రూ.90వేలు
  • ఎం.ఫార్మసీ కనీసం రూ.64వేలు .. గరిష్ఠం రూ.1.6 లక్షలు
  • ఫార్మా-డి, పి.బి. కి గరిష్ఠంగా రూ.1.25 లక్షలు
హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : ఇంజనీరింగ్‌, ఎంటెక్‌ కోర్సులకు ఫీజులు ఖరారు చేసిన ప్రభుత్వం.. మరికొన్ని కోర్సులకు ట్యూషన్‌ ఫీజులను ఖరారుచేసింది. బీఆర్క్‌, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మా-డి, ఫార్మా(పి.బి)కోర్సులకు కాలేజీల వారీగా ట్యూషన్‌ ఫీజులు తేలాయి. బీఆర్క్‌ కోర్సుకు కనీష్ఠంగా రూ.35వేలుగా.. గరిష్ఠంగా రూ.60వేలు; బి.ఫార్మసీకి క నీస ఫీజు రూ.35వేలుగా.. గరిష్ఠంగా రూ.90వేలు; ఎంఫార్మసీ కోర్సుకి కనీసం ఫీజుగా రూ.64వేలు.. గరిష్ఠ ఫీజుగా రూ.1.60 లక్షలు; ఫార్మా-డి, ఫార్మా(పి.బి.) కోర్సులకు కనీస ఫీజుగా రూ.68 వేలు.. గరిష్ఠ ఫీజుగా రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు. ఇవి 2016-17 నుంచి మూడేళ్లు అమలులో ఉంటాయని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి (ఇన్‌ఛార్జి) ఆర్‌.పి.సిసోడియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో రెండు ప్రైవేట్‌ బీఆర్క్‌ కాలేజీలు, 105 బీపార్మసీ కాలేజీలకు, 32 ఫార్మా-డి కాలేజీలు, 21 పార్మా (పి.బి), 101 ఎంఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. బీ పార్మసీలో కె.వి.ఎస్‌.ఆర్‌. సిద్దార్థ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మాష్యూటికల్స్‌ కాలేజీకి అత్యధికంగా రూ.90 వేలుగా ఖరారు చేశారు.
 
కాలేజీలు, ఫీజుల పూర్తి వివరాలు కోసం ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్లో..