Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 25 2016 @ 23:55PM

ఆహారధాన్యాల దిగుబడి 27 కోట్ల టన్నులు: ఐసీఏఆర్‌

ఈ ఏడాది ఖరీఫ్‌, రబీలలో దేశవ్యాప్తంగా 27 కోట్ల టన్నుల ఆహారధాన్యాల దిగుబడి రావచ్చునని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ టి.మహాపాత్ర చెప్పారు. భారీ వర్షాలు, వరదబాధిత ప్రాంతాల్లో నీటమునిగినా తట్టుకోగల ‘స్వర్ణసబ్‌ 1’ వంటి వంగడాలను పరిశోధకులు రూపొందించారని, వీటిని సాగుచేయాలని రైతులకు సూచించారు. వీటితోపాటు బినా ధన్‌ 8,10 రకాలను విడుదల చేస్తామన్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదుకానున్నప్పటికీ పత్తి సాగును ప్రోత్సహించరాదని చెప్పారు. కాయధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు .500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.