Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 25 2016 @ 23:03PM

ఖమ్మం జిల్లా ఇల్లందులో ఘోర రోడ్డు ప్రమాదం

ఖమ్మం: జిల్లాలోని ఇల్లందులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో అనిల్ కుమార్(25) అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. బైక్‌‌పై ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్నారు. కాగా మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు రవి, సుధీర్‌‌లు అని తెలిసింది. స్థానికులు గాయాలపాలైన ఇరువురిని అత్యవసర చికిత్సకై ఖమ్మంకు తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.