Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 25 2016 @ 23:00PM

‘డిడ్‌ యు నో’ హర్‌?

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా... కావేరి. ఫిల్మ్‌మేకర్‌ శేఖర్‌కపూర్‌, గాయని సుచిత్రా కృష్ణమూర్తిల ముద్దుల తనయ. తల్లిదండ్రులకు మల్లే తాను కూడా ‘స్పెషల్‌’ అనిపించుకోవాలనుకుందేమో.. ఇటీవల తన మొదటి మ్యూజిక్‌ వీడియో ‘డిడ్‌ యు నో’ రికార్డు చేసి యూట్యూబ్‌లో పెట్టింది. ఈ పాట రాసింది, కంపోజ్‌ చేసి పాడింది కూడా కావేరీనే. ఆరేళ్ల వయసు నుంచి కావేరి హిందుస్తానీ సంగీతంలో శిక్షణ తీసుకుంటోంది. అంతేకాదు వెస్ట్రన్‌ క్లాసికల్‌ వోకల్స్‌ నేర్చుకుంది. పియానో, గిటార్‌లను కూడా వాయిస్తుంది. నిజానికి కావేరి ఆరేళ్ల వయసు నుంచే పాడుతోంది. తన పాటలను తానే రాసుకుని, కంపోజ్‌ చేసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి మ్యూజిక్‌పై అమితమైన ఆసక్తి పెరిగిందంటుంది కావేరి.
 
‘నా పాటకు స్ఫూర్తి నా చుట్టూ ఉన్న పరిసరాలు, మనుషులే’ అని చెప్పింది. కావేరి పాటలు ఎక్కువగా తీవ్ర ఉద్వేగంతో కూడిన వ్యక్తిగత అనుభూతులతో నిండి ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి తాను పొందుతున్న ప్రోత్సాహం అపరమితమని కావేరి చెప్పింది. ‘అమ్మానాన్నలు నా ప్రతి కోరికను గౌరవించారు. నాకు అండగా నిలిచారు. వారి సహాయసహకారాలే లేకపోతే మ్యూజిక్‌ పట్ల నా ఇష్టాన్ని గుర్తించగలిగి ఉండేదాన్ని కాదు. నేను ఇలా డెవలెప్‌ అయిండేదాన్ని కాదు’ అని చెప్పుకొచ్చింది. కొసమెరుపు ఏమిటంటే కావేరి పాటకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. బాలివుడ్‌ స్టార్లయితే ‘వహ్‌ కావేరి’ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మనం కూడా ఈ యంగ్‌ కావేరికి బెస్ట్‌ విషస్‌ చెప్పేద్దాం.