Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 25 2016 @ 22:34PM

రిలాక్స్‌ కోసమే సోషల్‌ మీడియా

 ఎప్పుడూ చూసినా స్మార్ట్‌ఫోన్‌లోనే చూస్తున్నావు ఇక పనెప్పుడు చేస్తావు అని ఉద్యోగులను ప్రశ్నించేముందు బాస్‌లు ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఉద్యోగులు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమే కాసేపు సోషల్‌మీడియాను చూస్తున్నారని సర్వేలో వెల్లడయింది. ఆ విశేషాలు ఇవి..
 
ఒక ఉద్యోగి ఆఫీస్‌ పని వేళల్లో సోషల్‌ మీడియా చూస్తున్నాడంటే అది రిలాక్స్‌ కోసమేనట. ఈ విషయం అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయింది.
 
ఆఫీస్‌లో సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారంటే దానికి చాలా కారణాలుంటాయని పరిశోధకులు అంటున్నారు. అవి వృత్తి సంబంధమైనవి కూడా అయి ఉంటాయని వారు వివరిస్తున్నారు.
  • 34శాతం వర్క్‌ నుంచి రిలాక్స్‌ కోసం, రిలాక్స్‌ తీసుకోవడాని కోసం సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నామని చెప్పారు. సర్వేలో భాగంగా ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్న వారిని ప్రశ్నించారు. 
  • 27శాతం స్నేహితులతోనూ, కుటుంబసభ్యులతోనూ టచ్‌లో ఉండటానికి సోషల్‌ మీడియాను చూస్తున్నామని చెప్పారు. 
  • 24శాతం సంబంధాలు పెంచుకోవడానికి ఉపయోగిస్తున్నామని అంటే మరో 20% మంది పనిలో వస్తున్న సందేహాలను తీర్చుకోవడానికి వాడుతున్నామని అన్నారు. 
  • 17శాతం ఉద్యోగులు మాత్రం వర్క్‌ చేస్తూ కూడా పర్సనల్‌ రిలేషన్‌షి్‌ప్సను పెంచుకోవడానికి సోషల్‌ మీడియా వాడుతున్నారు. 
  • 14శాతం కొలిగ్స్‌ నుంచి ప్రొఫెషనల్‌ ఒపీనియన్‌ను తెలుసుకోవడానికి చూస్తున్నామని చెప్పారు. 
  • 18-29 సంవత్సరాల వారిని తీసుకుంటే 23శాతం మంది కొలిగ్స్‌ నుంచి ప్రొఫెషనల్‌ ఒపీనియన్‌ తెలుసుకోవడానికి సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారని చెబితే, 30-49 సంవత్సరాల వారిలో ఆ సంఖ్య 12శాతం, 50-64 సంవత్సరాల వారిలో 9 శాతం ఉంది.