Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 25 2016 @ 21:56PM

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా భారతీయుడు

ముంబై: ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా లాల్‌చంద్ రాజ్‌పుత్ ఎంపికయ్యారు. ఇంజామామ్ ఉల్ హక్ స్థానంలో రాజ్‌పుత్‌ను నియమించారు. నిజానికి లాల్‌చంద్ రాజ్‌పుత్‌ను బిసిసిఐ రెకమెండ్ చేసింది. గతంలో భారత అండర్ 19 క్రికెట్ జట్టు‌కు, ఇటీవల ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు లాల్‌చంద్ కోచ్‌గా వ్యవహరించారు. కోచ్ పోస్ట్‌కు మహ్మద్ కైఫ్ కూడా పోటీపడ్డారు. షార్ట్‌లిస్ట్ అయిన జాబితాలో కూడా కైఫ్ పేరుందని తెలిసింది. ముంబైలో పుట్టిన లాల్‌చంద్ రాజ్‌పుత్ 1985-87 మధ్యలో భారత జట్టు తరపున రెండు టెస్టులు, నాలుగు వన్డేలు ఆడారు. ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 2007లో జరిగిన ప్రపంచ టి20 కప్ సీరీస్ సమయంలో భారత జట్టుకు మేనేజర్ కూడా వ్యవహరించారు.