desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 25 2016 @ 19:12PM

భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయిందని నగ్నంగా ఊరంతా...

ఉదయ్‌పూర్‌: ఎంత ఆధునిక యుగంలో ఉన్నా.. పైశాచికత్వం ఇంకా ఉనికిలోనే ఉందని రుజువు చేస్తున్న ఘటన ఇది. వివాహమైన మహిళ తన భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయిందనే కారణంతో వారిరువురికీ దారుణమైన శిక్ష వేశారు. ఈ పాపంలో ఆమె భర్త, కుటంబ సభ్యులతోపాటు గ్రామస్థులూ పాలు పంచుకున్నారు.
 
భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయిందనే కారణంతో ఆ మహిళను, ఆమె ప్రియుడిని ఊరంతా నగ్నంగా ఊరేగించారు. అనంతరం వారిద్దరినీ రెండ్రోజులపాటు చెట్లకు కట్టేసి చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన ప్రభుత్వకార్యాలయం, ప్రాథమిక పాఠశాలకు సమీపంలోనే జరిగింది. అయినా ప్రభుత్వ అధికారులు గానీ, ఉపాధ్యాయులు గానీ నోరుమెదపలేదు. రెండ్రోజుల తర్వాత ఆ మహిళ ప్రియుడి కుటుంబ సభ్యులు పంచాయితీకి రూ.80 వేలు కట్టి అతణ్ని విడుపించుకెళ్లారు. తర్వాత ఈ సమాచారం పోలీసులకు అందడంతో ఆ మహిళను రక్షించారు. ఆ మహిళ భర్తతోపాటు మొత్తం 13 మందిని అరెస్ట్‌ చేశారు. ఇంత దారుణం జరుగుతున్నా స్పందించనందుకు వివరణ ఇవ్వాల్సిందిగా టీచర్లను, ప్రభుత్వోద్యోగులను ఉన్నతాధికారులు ఆదేశించారు.