Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 25 2016 @ 16:19PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి సీఎం చంద్రబాబు

విశాఖ: విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రాత్రికి ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు చైనా బయల్దేరనున్నారు. రేపటి నుంచి 30 వరకు చైనాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. తొలి రోజు 5 ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయని పరకాల ప్రభాకర్‌ అన్నారు. గత చైనా పర్యటన తర్వాత రూ.5 వేల కోట్ల పెట్టుబడులు, వాణిజ్యపరంగా చైనా, ఏపీ మధ్య బలమైన సంబంధాలు ఏర్పాడ్డాయని పరకాల తెలిపారు. చంద్రబాబు బృందంలో మంత్రులు యనమల, నారాయణ, పరకాల సహా పలువురు ఐఏఎస్‌లు ఉంటారు.