Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 1 2016 @ 01:36AM

విద్యకు ప్రభుత్వాల పెద్దపీట

  •  తమిళనాడు గవర్నర్‌ రోశయ్య 
నరసన్నపేట, మే 31: ప్రతి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఆయా ప్రభుత్వాలు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాయని, ఇది శుభపరిణామమని తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శర్వాణి విద్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయన్నారు. తాము ఎన్ని ఇబ్బందులు పడినా.. పిల్లలను బాగా చదివించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఉన్నారని అన్నారు. ప్రైవేటు పాఠశాలలతో సమానంగా ప్రభుత్వం పాఠశాలలు కూడా మెరుగైన విద్యనందిస్తున్నాయని ఆయన తెలిపారు.