Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 1 2016 @ 01:18AM

ఫ్రూటీలో జలగ

  •  తాగిన చిన్నారికి అస్వస్థత 
చెన్నై, మే 31 (ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొం దేందుకు శీతలపానీయాలను సేవించే సమయంలో ఒక్క నిమిషం ఆగండి. ఆ శీతలపానీయాన్ని ఒక్కసారి నిశితంగా గమనించండి. అందులో ఏజీవీ లేదని నిర్ధారించుకున్నాకే తాగండి. లేదంటే చెన్నైలో ఓ చిన్నారి పరిస్థితే మీకూ ఎదురుకావొచ్చు. ఇంతకీ ఏమైందంటే.. అదిరిపోయే ఎండలకు తాళలేక రెండేళ్ల చిన్నారి ఉషశ్రీ ఫ్రూటీ తాగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె స్పృహ తప్పిపడిపోవడంతో తల్లిదండ్రులకు ముచ్చెమటలు పోశాయి. ఆమె తాగిప ఫ్రూటీ ప్యాకెట్‌ను తల్లిదండ్రులు ప్రేమ్‌కుమార్‌, అభిరామి పరిశీలించగా అందులో నుంచి జలగ బయటపడింది. దీంతో ఆ చిన్నారిని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రేమ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.