Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 1 2016 @ 00:42AM

ప్రీ క్వార్టర్స్‌లో సైనా

  • ఇండోనేసియా ఓపెన్‌
జకర్తా: భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఇండోనేసియా ఓపెన్‌లో ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఆరంభ రౌండ్లో మూడుసార్లు టోర్నీ చాంపియన్‌, ఎనిమిదో సీడ్‌ సైనా 21-11, 19-21, 21-15తో పే యూ పొ (చైనీస్‌ తైపీ)పై చెమటోడ్చి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ గంటా 3 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌ ఆరంభంలో నెహ్వాల్‌ 14-11తో ఆధిక్యంలో నిలిచింది. సెకండా్‌ఫలో ఆమె వరుసగా 7 పాయింట్లు నెగ్గి గేమ్‌ దక్కించుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ సైనా 10-5తో జోరు ప్రదర్శించింది. అయితే తర్వాత పుంజుకున్న తైపీ షట్లర్‌ 12-10లో లీడ్‌లోకి వెళ్లింది. బ్రేక్‌ తర్వాత పే యూ తన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ గేమ్‌ గెలిచి.. మ్యాచ్‌లో నిలిచింది. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లోనూ సైనా 11-5తో జోరు ప్రదర్శించింది. కానీ, తైపీ షట్లర్‌ 13-13తో స్కోర్లు సమం చేసింది. చివర్లో అద్భుత ప్రదర్శనతో నెహ్వాల్‌ గేమ్‌తో పాటు మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఇక ప్రీ క్వార్టర్స్‌లో అన్‌సీడెడ్‌ ఫిత్రియాని (ఇండోనేసియా)తో సైనా తలపడనుంది. కాగా, మిక్స్‌డ్‌ తొలి రౌండ్‌లో మను అత్రి-అశ్విని పొన్నప్ప జోడీ 14-21, 25-27తో వరుస గేముల్లో యోంగ్‌ కై టెర్రీ హీ-వే హన్‌ టన్‌ (సింగపూర్‌) ద్వయం చేతిలో ఓటమి పాలైంది.