desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 31 2016 @ 19:21PM

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫస్ట్‌లుక్..

యంగ్‌హీరో నిఖిల్, టైగర్ ఫేం వి.ఐ.ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అనే టైటిల్ ఖరారు చేశారు. మేఘన ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన హెబా పటేల్, నందిత శ్వేత నటిస్తున్నారు. జూన్ 1న హీరో నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... ‘ఈ సినిమా ఇప్పటికే 80శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. వైవిధ్యమైన ప్రేమకథతో దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అతి త్వరలో టీజర్‌ని.. అలాగే శేఖర్ చంద్ర అందించిన ఆడియోని విడుదల చేసి చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. నిఖిల్‌, హెబాప‌టేల్‌, నందిత శ్వేత‌, వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా హ‌ర్ష‌, సుద‌ర్శన్, భ‌ద్రమ్‌, అపూర్వ శ్రీనివాస్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించగా... పాట‌ల- రామ‌జోగ‌య్య శాస్ట్రి, శ్రీమ‌ణి, ఆర్ట్‌- రామాంజ‌నేయులు, ఎడిట‌ర్- చోటా.కె.ప్రసాద్‌, సంగీతం-శేఖ‌ర్ చంద్ర‌, మాట‌లు- అబ్బూరి ర‌వి, డి.ఓ.పి- సాయి శ్రీరామ్‌, నిర్మాత‌- మేఘ‌న ఆర్ట్స్‌, స్టోరి, స్క్రీన్‌ప్లే,డైర‌క్టర్‌- వి.ఐ.ఆనంద్‌.