Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 31 2016 @ 18:48PM

కేజ్రీకి ఊరట: మోదీపై వ్యాఖ్యల కేసు కొట్టివేత

ఢిల్లీ : ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశపూర్వకంగానే కించపరుస్తున్నారంటూ కేజ్రీవాల్‌పై నమోదైన క్రిమినల్‌ ఫిర్యాదును దిల్లీ కోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ క్రిమినల్ ఫిర్యాదును అడ్వొకేట్‌ ప్రదీప్‌ ద్వివేది దాఖలు చేశారు. గత డిసెంబర్‌లో దిల్లీ సచివాలయంలోని ప్రిన్సిపల్‌ సెక్రటరీ కార్యాలయంపై సీబీఐ దాడులు జరిపింది. దీనిపై అప్పట్లో కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ప్రధానిని ఘాటుగా విమర్శించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే మోడీ పిరికివానిగా వ్యవహరించారంటూ ఆరోపించారు. ఆయనకు ఏదో మానసిక రుగ్మత ఉందంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఢిల్లీ లాయర్ ప్రదీప్ ద్వివేది అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశద్రోహం (సెక్షన్ 124ఎ), పరువునష్టం (సెక్షన్ 500) నేరాల కింద కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అయితే ఆ ఫిర్యాదును ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది.