Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 31 2016 @ 10:58AM

మెగాఫోన్ పట్టనున్న మహేశ్ సోదరి

మహేశ్ సోదరి మంజుల మెగాఫోన్ పట్టనున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ‘షో’, ‘కావ్యాస్ డైరీ’, ‘ఆరెంజ్’ తదితర చిత్రాలలో నటించి మరోవైపు నిర్మాతగానూ ‘నాని’, ‘ఏ మాయ చేశావే’ వంటి సినిమాలు చేసిన మంజుల త్వరలోనే కెప్టెన్ కుర్చీలో ఎక్కనున్నారట. ఈ సినిమాలో నాని హీరోగా నటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే నానితో చర్చలు కూడా జరుపగా అతడు సుముఖత తెలిపాడట. మరి ఈ సినిమాని మంజుల స్వయంగా నిర్మిస్తారా లేక వేరే బ్యానర్‌లో చేస్తారా అన్నది తెలియాల్సుంది. ఇదిలా ఉంటే నాని కోసం ఇప్పటికే దాదాపు అరడజను మంది దర్శకులు కాచుకుని ఉన్నారు. వారిలో ‘ఉయ్యాల జంపాల’ దర్శకుడు విర్మించి వర్మ, ‘సినిమా చూపిస్తా మావా’ దర్శకుడు ‘త్రినాథరావు నక్కిన’, ‘భలే మంచి రోజు’ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య వంటివారున్నారు. మరోవైపు నాని ప్రాణ స్నేహితుడు మరియు నటుడు కమ్ డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల కూడా నానితో ఓ సినిమా చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు ఆ క్యూలో మంజుల కూడా వచ్చి చేరారు. వీరందరిలో నాని ముందుగా ఎవరితో చేయి కలుపుతాడో చూడాలి. ఇదిలా ఉంటే జూన్ 17న నాని జెంటిల్‌మన్‌గా రానున్న సంగతి తెలిసిందే.