Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 31 2016 @ 10:48AM

కేంద్ర ప్రభుత్వం ‘ఇంద్ర ధనుష్’ మారుతోంది

న్యూఢిల్లీ : వ్యాధి నిరోధక శక్తిని కలిగించే వ్యాక్సిన్ల కార్యక్రమం ఇంద్ర ధనుష్‌ను మరింత విస్తరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఏడు ప్రాణాంతక వ్యాధులకు ఈ పథకం క్రింద వ్యాక్సిన్లను ఇస్తున్నారు. ఇకపై మరో నాలుగు వ్యాక్సిన్లను జోడిస్తోంది. రోటావైరస్, మీజిల్స్ రుబెల్లా, ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ బయవాలెంట్, జపనీస్ ఎన్సెఫలిటిస్ వ్యాక్సిన్లను ఇస్తారు.
 
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా మాట్లాడుతూ ఇంద్ర ధనుస్సులోని ఏడు రంగుల మాదిరిగా ఏడు వ్యాక్సిన్లను ఇచ్చేవారమని, ఇప్పుడు వ్యాక్సిన్ల సంఖ్య 11కు చేరడంతో ఈ పథకానికి కొత్త పేరును అన్వేషిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం అంగుడు వాపు, తీవ్రమైన దగ్గు, ధనుర్వాతం, పోలియో, క్షయ, మశూచి, హెపటైటిస్ -బి వ్యాధులకు నిరోధక వ్యాక్సిన్లు ఇస్తున్నామన్నారు. వ్యాధినిరోధక వ్యాక్సిన్లు పొందనివారు లేదా పాక్షికంగా పొందినవారు ఉన్న 201 జిల్లాలను గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 82 జిల్లాలు ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనే ఉన్నాయన్నారు దేశంలో వ్యాక్సిన్లు పొందని, లేదా పాక్షికంగా పొందినవారిలో 25 శాతం మంది ఈ జిల్లాల్లోనే ఉన్నారని తెలిపారు.