Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 31 2016 @ 09:07AM

రాజధానికి రూటు

  • హైదరాబాద్‌ నుంచి తరలివస్తున్న కార్యాలయాలు
  • గుంటూరులో సహకార శాఖ రాష్ట్ర కార్యాలయం
  • శ్యామలానగర్‌, నల్లపాడుల్లో భవనాల పరిశీలన
  • విజయవాడలో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయం
జూన్‌ నెలాఖరులోపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను గుంటూరు - విజయవాడ ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కొక్కటి గా తరలి వస్తున్నాయి. తాజాగా సహకార శాఖ కార్యాలయం ఏర్పాటుకు సోమవారం భవనాలను పరిశీలించారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కె ట్‌ సమీపంలోని ఇమ్దా భవనంలో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ షరీఫ్‌ తెలిపారు.


(ఆంధ్రజ్యోతి - గుంటూరు) : గుంటూరులో మరో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం రానుంది. సహకార శాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేస్తున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారులు సోమవారం గుంటూరులోని పలు ప్రాంతా ల్లో పర్యటించారు. నల్లపాడు, శ్యామలానగర్‌ ప్రాంతాల్లో రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శాఖ రాష్ట్ర కమిషనర్‌ మిరియాల వెంకట శేషగిరిబాబు, అడిషనల్‌ రిజిస్ర్టార్‌లు అర్జునరావు, అలీ అక్బర్‌ బాషా, జిల్లా సహకార శాఖ అధికారి (డీసీవో) పాండు రంగారావు, గుంటూరు డివిజన్‌ అధికారి లతీ్‌ఫలు భవనాలను పరిశీలించారు.
 
హైదరాబాద్‌లోని కమిషనర్‌ కార్యాలయంలో సుమారు 150 మంది పని చేస్తున్నారు. ఈ కార్యాలయానికి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణం భవనాలు అవసరం ఉంది. గుంటూరులో కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేసేది రెండు, మూడు రోజుల్లో ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు. విజయవాడలో ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఎంఎ షరీఫ్‌ తెలిపారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌ సమీపంలోని ఇమ్దా భవనాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆయన సోమవారం గుంటూరులోని జడ్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మైనార్టీ సంక్షేమ శాఖ, మైనార్టీ కార్పొరేషన్‌, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. కార్యాలయాలకు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
 
5న విజయవాడలో మైనార్టీ జాబ్‌ మేళా
రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 5న ప్రత్యేకంగా విజయవాడలో మైనార్టీలకు జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ షరీఫ్‌ తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, ఆయా కంపెనీలు జాబ్‌ మేళాలో పాల్గొంటాయన్నారు. ఆదాయం లేని మసీదుల్లో పని చేసే వారికి గౌరవ వేతనం రూ. 3 వేలు రూ. 5వేల చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దుల్హన పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.54 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అషిరి తదితరులు పాల్గొన్నారు.