Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 31 2016 @ 03:39AM

10న సూర్యాపేటలో అమిత్‌షా సభ

హైదరాబాద్‌, మే 30(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మరో పర్యటన ఖరారైంది. ఆయన జూన 10న సూర్యాపేటలో బూతస్థాయి కార్యకర్తలతో సమావేశమవుతారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో అమితషా పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.