desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 6 2016 @ 09:26AM

మహిళలపై ఆగని అఘాయిత్యాలు

  • కామాంధులపై నిర్భయ కేసు 
  • కాసిపేట ఘటనను వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి
  • సంచలనం రేపిన సంఘటన
  • మహిళలు, బాలికలపై ఆగని లైంగిక దాడులు
  • పంచాయితీలతో సెటిల్‌మెంట్లు
కాసిపేట మండలం పల్లంగూడ బాలికను లోబర్చుకుని గర్భవతిని చేసిన సంఘటన సంచలనం కలిగించింది. శీలానికి పంచాయితీ వెల శీర్షికన ఆంధ్రజ్యోతి మెయిన్‌లో కథనం ప్రచురితమైంది. పల్లెలో జరిగిన దారుణం వెలుగులోకి రావడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ ఆకృత్యంలో తండ్రీ కొడుకులు పాలుపంచుకోవడం దారుణం. ఈ ఘటన బయటికి రాకుండా గ్రామ పెద్దలు శీలానికి వెల కట్టారు. రెండున్నర లక్షలు ఇవ్వాలని తీర్మానించారు. అధికారులు గురువారం విచారణ జరిపి బాధ్యులైన ఐదుగురిపై నిర్భయ కేసు నమోదు చేశారు.
- బెల్లంపల్లి

అదిలాబాద్/బెల్లంపల్లి:
‘కర్మభూమిలో పూసిన ఓపువ్వా... విరిసీ విరియని ఓ చిరునవ్వా... కన్నుల ఆశలు నీరై కారగ కామాంధులకే బలి అయిపోయావా’ అంటూ ఓ కవి కలం నుంచి జాలువారిన ఆక్రందనను పట్టించుకునేదెవరు..? అర్ధరాత్రి సంగతి అటుంచితే పగలు కూడా మహిళలు ఒంటరిగా తిరిగేందుకు భయపడుతున్నారు. కొందరు మృగాళ్లు చేస్తున్న ఆకృత్యాలే దీనికి కారణం. వయ స్సు, వరసలు కూడా మర్చిపోయి సమాజంలో ఉంటున్నామనే స్ప్రహ లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. జిల్లాలో కొందరు కామాంధుల చేష్టలతో సభ్య సమా జం తలదించుకుంటోంది. ఆడపిల్లలపై చేయివేస్తే కఠినశిక్షలు తప్పవంటూ నిర్భయ చట్టం తెచ్చిన తర్వాత జిల్లాలో మహిళలు, చిన్నారులపై మరిన్ని ఎక్కువగా ఆకృత్యాలు జరగడం విచారకరం. సభ్య సమాజం తలదించుకునేలా స్వార్ధంతో మనిషి జీవనం సాగిస్తున్నాడు. స్వార్ధానికి మారుపేరు మనుషులు అనే మాటను నిజం చేస్తూ భవిష్యత్‌ తరాలకు ఇదే బాటలు వేస్తున్నారు కొందరు మృగాళ్లు... ఇటీవల జిల్లాలో జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం.
 
             ఈ సమాజంలో స్ర్తీని ఒక తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా ఆరాధించాలి. అనాధిగా స్ర్తీని ఆదిశక్తిగా కొలుస్తున్నాం. అటువంటి మహిళలు వంటింటిని విడిచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న క్రమంలో వారి పై పైశాచిక దాడులు ఎక్కువవుతున్నాయి. మళ్లీ తిరిగి వంటింటికే పరిమితమయ్యే పరిస్థితి లేకుండా సమాజాభివృద్ధిలో స్ర్తీ కీలక పాత్ర పోషించాలని సమర్ధవంతమైన నిర్భయ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ చట్టం వచ్చి మూడేళ్లు అయినప్పటికీ మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. అయితే యువతులను, బాలికలను, మహిళలను వేధించినా, లైంగిక వేధింపులకు గురి చేసినా యాసిడ్‌ దాడులకు పాల్పడినా, అసభ్యకరంగా ప్రవర్తించినా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు చేస్తూ వారి దుర్మార్గం బయటకు రాకూడదని ఎంతటి దారుణాలకైనా వెనకాడడం లేదు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తే బెయిల్‌ మంజూరు కావడంతో నిందితుల్లో భయం పోతుందనే భావన వినిపిస్తోంది. మహిళలను వేధింపులకు గురిచేసిన నిందితులకు బెయిల్‌ ఇవ్వకుండా కఠిన శిక్షలు అమలు చేయాలని ఉరి శిక్షలు విధించాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
 
పంచాయితీలతో సెటిల్‌ చేసుకుంటున్న మృగాళ్లు..
జిల్లాలోని మారుమూల గ్రామాల్లో బాలికలపై, మహిళలపై, యువతులపై అత్యాచారాలకు పాల్పడుతున్న కొందరు మృగాళ్లు ఊరి పెద్దలతో విష యం బయటకు పొక్కకుండా పంచాయితీలు పెట్టి వారికున్న పలుకుబడితో, ధన దాహంతో సెటిల్‌మెంట్‌లు చేసుకుంటున్నారు. పేదరికాన్ని ఆసరా చేసుకుని మహిళలను మభ్య పెడుతూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. బాధితురాళ్ల తల్లిదండ్రులు అన్యా యం జరిగిందని ఊరి పెద్దలను ఆశ్రయిస్తే ఊరి పరువు పోతుంది, ఇంటి పరువు పోతుందని వారిని దబాయిస్తూ అయ్యింది ఏదో అయ్యింది పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరిస్తామని కామాంధులకు సహకరిస్తుండడంతో అత్యాచార సంఘటనలు బయటకు రావడం లేదు. ఈ పంచాయితీల విషయాలు సంబంధిత పోలీసు అధికారులకు తెలిసినా చాలా మట్టుకు పట్టించుకోకపోవడంతో పంచా యితీలతో సెటిల్‌మెంట్‌లు చేసుకుంటూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు.