desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 6 2016 @ 04:09AM

అన్నింటినీ కరువు మండలాలుగా ప్రకటించాలి

  •  తక్షణ సహాయ చర్యల కోసం గవర్నర్‌కు టీజేఏసీ వినతి 
హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా గుర్తించి ప్రభుత్వం తక్షణ సహాయ చర్యలు తీసుకునేలా చూడాలని గవర్నర్‌ నరసింహనను టీజేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం రాజ్‌భవనలో గవర్నర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో తెలంగాణ రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులు జస్టిస్‌ చంద్రకుమార్‌, అడ్వొకేట్‌ జేఏసీ నేత ప్రహ్లాద్‌, రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, పశ్య పద్మ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో కరువుతో రైతులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని, కరువు పీడిత ప్రాంతాల్లో ఇప్పటికీ అధికారులు సరైనరీతిలో స్పందించడం లేదని గవర్నర్‌కు వివరించారు. అన్ని మండలాల్లో నీటి సమస్య పరిష్కరించాలని కోరారు. ప్రత్యేకించి కరువు పీడిత ప్రాంతాల్లో తక్షణం తాగునీటి సమస్యను పరిష్కరించాలని, ఆయా ప్రాంతాల్లో రైతుల రుణాలను రీషెడ్యూల్‌ చేయడం లేదా, మాపీ చేయాలని కోరారు. గవర్నర్‌ తమ విజ్ఞప్తులను పరిశీలించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చినట్టు ప్రతినిధులు తెలిపారు.