desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 6 2016 @ 04:01AM

వడదెబ్బకు 46 మంది మృతి

  •  ఏపీలో 33.. తెలంగాణలో 13 
(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)
తెలుగు రాష్ర్టాల్లో కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసినా... వడగాలులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో, ప్రజలతోపాటు భారీగా పశువులూ మృ త్యువాత పడుతున్నాయి. ఇరు రాష్ర్టాల్లో గురువారం మొత్తం 46 మంది వడదెబ్బతో చనిపోయారు. వీరిలో... ఏపీలో 33 మంది, తెలంగాణలో 13 మంది ఉన్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి(8), కరీంనగర్‌(6), విశాఖపట్నం, నల్గొ ండ(4), కర్నూలు(3), నెల్లూరు, కడప(2), గుం టూరు, కృష్ణా, మెదక్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌(1) జిల్లాల్లో వడదెబ్బ మరణాలు చోటుచేసుకున్నా యి. కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలంలోని మొయిళ్ల చెరువు గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి అనే రైతుకు చెందిన 33 గొర్రెలు కూ డా వడదెబ్బకు బలయ్యాయి. గొర్రెలకు మేత దొరక్కపోవడంతో 20 రోజుల క్రితం ఇతర గ్రామాలకు తోలుకెళ్లాడు. తిరిగివస్తున్నప్పుడు పాములూరు గుట్టవద్దకు సమీపంలో గొర్రెలు మృతి చెందాయి.