Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 04:32AM

కందుకూరు ప్రాంతంలో విస్తారంగా పొగనారు సాగు


(కందుకూరు)
కందుకూరు ప్రాంతంలో ఈ ఏడా ది పొగ నారుమడుల సాగు గణ నీ యంగా పెరిగింది. రెండేళ్లుగా పొగా కు నారుదొడ్లు పెట్టిన రైతులు లాభా లు గడించటం, ఈ ఏడాది పొగాకు సాగు విస్తీర్ణం పెరుగుతుందన్న అంచ నాలతో నారు దొడ్లు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. కందుకూరు, వలేటివా రిపాలెం, లింగసముద్రం, పొన్నలూరు, జరుగుమల్లి మండలాల్లోని అనేక గ్రామాలలో గత పది, పదిహేను రోజులుగా విస్తారంగా నారు మడులు పెట్టిన రైతులు బుధ, గురువారాలలో కురిసిన వర్షాలతో మరికొంత విస్తీర్ణం లో కూడా నారు దొడ్లు పెట్టేందుకు సిద్ధం చేస్తున్నారు. గడచిన రెండేళ్లలో పొగనారు సాగుచేసిన రైతులు విపరీ తమైన హెచ్చతగ్గులు లేకుండా నడవ టంతో లాభాలు గడించారు. దీనికి తోడు ఈ ఏడాది నల్లరేగడి నేలల్లో పొగాకు సాగు చేయటం మినహా రైతుకి మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు ఏర్పడటంతో పొగా నారు కి మంచి గిరాకీ వస్తుందని ఆశిస్తున్న నారుదొడ్ల నిర్వాహకులు ఇబ్బడిముబ్బ డిగా నారు సాగు చేస్తున్నారు. మూడేళ్లుగా శనగలు కోల్డ్‌ స్టోరేజిలలో మగ్గుతుం డటంతో శనగ సాగు చేయటానికి సాహసించబోడని భావి స్తున్న రైతులు నల్లరేగడి నేలల్లో పొగా కు వేయటం మినహా ప్రత్యామ్నాయం లేదని అంచనా వేస్తున్నారు. గత ఏడాది అరవై, డెబ్భై వేలకు బ్యారన్లు లీజుకి తీసుకున్న రైతులు గత రెండే ళ్లలో లాభాలు రావటంతో బ్యారన్‌ లక్షకు మించి కౌలు చెల్లించి తీసుకుం టున్నారు. ఈ ఏడాది పొగాకు విస్తీ ర్ణం పెరుగుతుందన్న అంచనాలకు బలం చేకూరుతోంది. దీనికి తోడు గతంలో రాజమండ్రి, కొవ్వూరు, దొమ్మే రు పరిసర ప్రాంతాలకు వెళ్లి పొగ నారు తెచ్చుకునే వారు. రవాణా ఛార్జీ లు, నారు అక్కడి నుండి తెచ్చి నాట్లు వేసేలోగా వేడెక్కి కొంతమేర చనిపో వటం తదితర కారణాలతో స్థానిక నారు దొడ్లలోనే మూటకు వంద రెండు వందలు అదనంగా చెల్లించైనా కొనుగోలు చేస్తుండటం నారుదొడ్ల నిర్వాహకులకు లాభాలు తెచ్చి పెడు తోంది. కందుకూరులోని రెండు వేలం కేంద్రాల పరిధిలోనే ఇప్పటి వరకు రమారమి 300 హెక్టార్లలో పొగనారు దొడ్లు సాగయి ఉంటాయని రానున్న వారం పదిరోజులలో మరో వంద ఎకరాల వరకు సాగవుతుందని అంచ నా వేస్తున్నామని బోర్డు అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు వంద హెక్టార్ల నారు దొడ్లు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేస్తున్నామని వివరించారు.


ఊ ఒ