Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 04:29AM

నేడు ఖానాపురం సొసైటీ చైర్మన్‌ ఎన్నిక

ఖానాపురం: ఖానాపురం ప్రాథమిక వ్యవసా య సహకార సంఘం అధ్యక్ష పదవికి సోమ వారం జరగనున్న ఎన్నికపై ఆసక్తికర పరిణా మాలు నెలకొన్నాయి. అటు కాంగ్రెస్‌ ఇటు టీఆర్‌ఎస్‌ పార్టీలు వ్యూహాత్మకంగా శిబిరాలను నిర్వహించి ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఖానాపురం పీఏసీఎస్‌లో 13మంది డైరెక్టర్లకు చైర్మన్‌గా కొనసాగిన తక్కళ్లపెల్లి రవీందర్‌రావు ఎంపీటీసీగా విజయం సాధించి మండల అధ్య క్ష పదవికి ఎన్నికయ్యారు. దీంతో పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. మరో డైరె క్టర్‌ పడిదల రవీందర్‌రావు ఎంపీటీసీగా గెలు పొందడంతో డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేయ గా ప్రస్తుతం పాలకవర్గం సభ్యులు 11మంది ఉన్నారు. మొన్నటి వరకు ఆరుగురు డైరెక్టర్లు టీఆర్‌ఎస్‌ శిబిరంలో, ఐదుగురు డైరెక్టర్లు కాంగ్రె స్‌ శిబిరంలో ఉండగా, ధర్మరావుపేటకు చెందిన డైరెక్టర్‌ కొనకటి నర్సిరెడ్డి తిరిగి కాంగ్రెస్‌ శిబిరం లోకి చేరగా టీఆర్‌ఎస్‌ పార్టీ అంచనాలు తారు మారయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ శిబిరంలో ఆరుగురు డైరెక్టర్లు, టీఆర్‌ఎస్‌లో ఐదుగురు డైరెక్టర్లు ఉండడంతో కాంగ్రెస్‌కే చైర్మన్‌ పదవి దక్కే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీల కులు భావిస్తున్నారు. ధర్మరావుపేటకు చెందిన డైరెక్టర్‌ ముదురు కుమారస్వామిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని అతడి భార్య దేవి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈపరిణామంతో సోవారం జరగనున్న ఎన్నిక ఆసక్తికరంగా మారనుంది. దీంతో ఎవరి వ్యూహం ఫలించనుందో వేచి చూడాల్సిందే.
మాయమాటలతో కారెక్కించారు..
డైరెక్టర్‌ నర్సిరెడ్డి
టీఆర్‌ఎస్‌ నాయకులు మాయమాటలు చెప్పి కారులో తీసుకెళ్లి పార్టీ కండువా కప్పి బలవంతంగా కాకినాడ క్యాంపునకు తీసుకెళ్లా రని ధర్మరావుపేట గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్‌ కొనకటి నర్సిరెడ్డి తెలిపారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడుతూ ఈనెల 16న నర్సంపేటలోని ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఉన్న తనను కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు పిలిచి మాట్లాడే పనుందని కారులో ఎక్కించు కొని హన్మకొండలో పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్లి గులాబీ కండువా కప్పారన్నారు. అనంతరం తనను బలవంతంగా మభ్యపెట్టి కాకినాడలోని టీఆర్‌ఎస్‌ శిబిరానికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నా కుటుంబ సభ్యులు శిబిరం ఆచూకీ కనుగొని బయటికి తీసుకువచ్చారని చెప్పారు. ముమ్మాటికి కాంగ్రెస్‌ పార్టీనే నమ్ముకున్న నేను దొంతి మాధవరెడ్డి సూచించిన మార్గంలోనే ప్రయాణిస్తానని ఆయన తెలిపారు.
సొసైటీ డైరెక్టర్‌ కిడ్నాప్‌పై కేసు నమోదు
ధర్మరావుపేట గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్‌ ముదురు కుమారస్వామిని గుర్తు తెలి యని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని అతని భార్య దేవి ఆదివారం పోలీస్‌కు ఫిర్యాదు చేసింది. ఎస్సై అశోక్‌కుమార్‌ కథనం ప్రకారం... ఆది వారం తెల్లవారుజామున మూడు గంటలకు గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు ఇంటికి వచ్చి మాట్లాడే పనుందని కుమారస్వామిని బయటికి తీసుకెళ్లి కిడ్నాప్‌ చేశారని తెలిపారు. సొసైటీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తన భర్తను కిడ్నాప్‌ చేసినట్లు అతని భార్య తెలి పినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్నిక వాయిదా
సొసైటీ ఎన్నిక వాయిదా పడినట్లు ముఖ్య కార్యనిర్వహణాధికారి గుజ్జ మాధవరావు తెలిపారు. డైరెక్టర్‌ కిడ్నాప్‌కు గురయ్యాడని అతడి భార్య ఇచ్చిన ఫిర్యాదు దృష్ట్యానే వాయిదా పడి ఉండోచ్చని తెలిపారు.