Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 04:29AM

బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుదాం..

రెవెన్యూ కాలనీ : ఆరు దశాబ్దాల పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాషా్ట్రన్ని బంగా రు తెలంగాణగా నిర్మించుకునేందుకు ప్రతిఒక్క రు పునరంకితం కావాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. హన్మకొండలోని ఆర్ట్స్‌ కళా శాల సెమినార్‌ హాల్‌లో ఆదివారం టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ప్రభాకర్‌కు సన్మాన కార్యక్రమం జరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణను అడ్డుకోలేకపోయారన్నారు.60ఏళ్ల పోరా టం ముగిసినందున ఇప్పుడు తెలంగాణ సమా జం ఎన్నో సవాళ్లు, సమస్యలను ఎదుర్కొంటూ బంగారు తెలంగాణ దిశగా సాగాల్సి ఉందన్నా రు. ఈక్రమంలో ప్రతి తెలంగాణ వాది తనవం తు బాధ్యతను పోషించి ప్రభుత్వానికి సహకార మందించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం చిత్తశుద్ధికి ప్రజల అండదండలు తోడైతే త్వరలోనే బంగారు తెలంగాణ ఆవిష్కృతమవుతుందని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్‌ఎస్‌కార్యకర్తలు సైని కుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేస్తే పార్టీలో గుర్తింపు తప్పక లభిస్తుందన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి దక్కడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారం మరువలేనిదంటూ ఆయనకు ఎమ్మెల్సీ ప్రభాకర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.
జిల్లా, నగర అధ్యక్షులు రవీందర్‌రావు, నన్నపనేని నరేందర్‌, జిల్లా ఇన్‌ఛార్జి సుదర్శన్‌రెడ్డి, వరంగల్‌ పడమర ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ క్రమ శిక్షణ, అంకితభావానికి ఎమ్మెల్సీ ప్రభాకర్‌ నిదర్శనంగా నిలిచార న్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పార్టీ ఉన్నతికి కార్యకర్తలు పాటుపడాలని కోరారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టీఆర్‌ఎస్‌ యువజన విభాగంజిల్లా అధ్యక్షుడు ఇండ్ల నాగే శ్వరరావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో తాము మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని,ముఖ్యంగా యువజన విభాగం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి, ప్రజలకు వారిధిగా నిలుస్తుందన్నారు. ప్రసంగాల అనంతరం టీఆర్‌ఎస్‌ నాయకులు కర్నె ప్రభాకర్‌ను శాలువా, పూలమాలలతో సన్మానించి మెమోంటోలు అందచేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కుసు మ జగదీష్‌, జోరిక రమేష్‌,గుడిమళ్ల రవికుమా ర్‌, వాసుదేవరెడ్డి, పక్కుల సురేందర్‌, సతీష్‌, ఉడుతల సారంగపాణి, ప్రసాద్‌, చింతల రాజు, సదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.