Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 04:24AM

బసవరాజుకండ్రిగలో అభివృద్ధి శూన్యం


పెద్దపంజాణి: పలమనేరు-పుంగనూరు జాతీయ రహదారిలోని బసవరాజు కండ్రిగ గ్రామంలో నాయకులకు కొదవలేదు. అయితే అభివృద్ధి జాడమాత్రం గ్రామంలో ఎక్కడా కనిపించదు. నిత్యం నాయకులు అధికారులు ఈ రహదారి గుండా వెళ్తున్నా గ్రామం వైపు కన్నెత్తి చూడరు. ఐదేళ్ళక్రితం ఇదే గ్రామం నుంచి మండల అధ్యక్షుడినిఎన్నుకున్నారు. ప్రస్తుతం ఇదే గ్రామం నుంచి మండల అధ్యక్షులు ఎంపికయ్యారు. అయితే గ్రామ పరిస్థితిలో ఎటువంటి మార్పులు లేవని గ్రామస్తులు వాపోతున్నారు.
ప్రధాన సమస్యలు...
పారిశుధ్య లోపం కారణంగా గ్రామంలో జ్వరాలు ప్రబలుతున్నాయి. మురుగునీటికాలువలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు పేరుకుపోయి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రానికి పక్కా భవనం లేకపోవడంతో పెచ్చులూడుతున్న ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. గ్రామానికి కొంచెం ఆవలగా వున్న 20 కుటుంబాలకు తాగునీటి సౌకర్యంగాని, రోడ్లుగానీ, కాలువలు గానీ మచ్చుకైనా లేవు. దాదాపు 70మంది విద్యార్థులు చదువుతున్నా ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేక చదువులు కుంటు పడుతున్నాయి. ఇటీవల లాస్య అనే ఓ చిన్నారికి డెంగీ సోకింది. దీనిపై వైద్యసిబ్బంది నామమాత్రమైన వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. 220 కుటుంబాలు దాదాపు వెయ్యి మందికిపైగా జనాభా వున్న గ్రామంలో చీకటి రాజ్యమేలుతోంది. నిత్యం విష సర్పాలతో భయం భయంగా గడపాల్సి వస్తోంది.