desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 03:51AM

కాసుల సీటు కోసం కోటి తిప్పలు!


ఆంధ్రజ్యోతి - కర్నూలు
రిజిసే్ట్రషన్‌ శాఖలో బదిలీల వ్యవహారం జోరందుకుంది. గడువుకు ముందే వచ్చి పడి న బదిలీలతో కొందరు ఉన్న సీటును కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొంద రు ఆదాయం ఉండే సీట్లకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీల కోసం తాము ఆ శ్రయించిన వారితో రోజూ తాజా పరిస్థితుల ను తెలుసుకుంటున్నారు. జిల్లాలో గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 2 సీట్ల కోసం కొందరు సీనియర్లు ప్రయత్నిస్తుండగా.. మంచి డిమాండ్‌ ఉండే చోటు కోసం మరికొందరు ఆరాటపడుతున్నారు.
కొందరిలో ఆనందం..
మరికొందరిలో ఆరాటం..
బదిలీలలపై కొందరు సబ్‌రిజిసా్ట్రర్లు ఆ నందపడుతుండగా.. మరికొందరు ఆరాటపడుతున్నారు. గత బదిలీలలో సూట్‌కేసులు సమర్పించుకుని బాగా ఆదాయమున్న సీట్ల లో కూర్చున్న అధికారులు.. అకస్మాత్తు బదిలీ లు ఆగిపోవాలని కోరుకుంటున్నారు. సాధారణంగా ఆ శాఖలో బదిలీలకు ఏప్రిల్‌ కట్‌ఆఫ్‌ టైంగా తెలుస్తోంది. ఆ సమయంలో బదిలీలు జరిగినా పిల్లలకు విద్యాసంవత్సరంలో ఇబ్బం దులు పడకుండా.. బదిలీ జరిగిన స్థానాల్లో పాఠశాలలను వెతుక్కునే సమయం ఉంటుం ది. ఈ నేపథ్యంలో ఏడాది కూడా దాటకుండా నే అనుకూలమైన సీట్లను వదులుకుంటే తా ము బదిలీ కోసం చెల్లించిన సొమ్ము కూడా సంపాదించలేమేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఈ బదిలీలు ఎలా గైనా ఆగిపోవాలని పలువురు కోరుకుంటున్న ట్టు తెలుస్తోంది. ఇక రెండో రకానికి చెందిన సబ్‌రిజిసా్ట్రర్లు మారుమూల ఆదాయంలేని కా ర్యాలయాల్లో పనిచేసేవారు. వీరిలో మంచి సీట్లలో పనిచేసిన వారు కూడా కొంతమంది ఉన్నారు. ఏడాదికి పైగా వారు మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తూ అవకాశం కోసం ఎదు రుచూస్తున్నారు. తాజాగా వచ్చిన ప్రత్యేక బ దిలీల జీవోను వారు సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలను మొదలు పెట్టారు. అవసరమనుకుంటే కోరుకున్న చోటుకు వెళ్లడానికి దళారులు నిర్ణయించిన సొమ్ము చెల్లించేదుకూ వె నుకాడడంలేదు. అడ్వాన్సుల రూపంలో రూ. 2 నుంచి 5 లక్షల దాకా సమర్పించుకుంటున్నారు.
భారమంతా ఉన్నతాధికారిపైనే..!
స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖలో బదిలీ ల భారమంతా జిల్లాకు చెందిన ఆశాఖ ఉన్న తాధికారిమీదే పడినట్టు తాజా సమాచారం. టీడీపీ ప్రభుత్వంలో బదిలీల పేరుతో పలువు రు చోటా నాయకులు వసూల్‌ రాజాలుగా మారిన తరుణంలో పూర్తిగా పరిస్థితి మారిపోయినట్టు తెలుస్తోంది. అవినీతితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే కారణంగా అధికార పార్టీకి చెందిన కీలకమైన నాయకులు చోటా నాయకులపై దృష్టి సారించి మందలిస్తున్న ట్టు సమాచారం. అంతేగాకుండా అధికారుల కదలికలపై కూడా నిఘావేసినట్టు తెలుస్తోం ది. పరిస్థితి ఇలా మారినా మామూళ్ల విషయంలో మాత్రం ఒక అవగాహనకు వచ్చిన ట్టు సమాచారం. బదిలీల్లో ఉన్నతాధికారే సర్వంగా మారి గిరాకిని బట్టి ముడుపుల్లో తమవాటా తమకు ఇవ్వాల్సిందేననే ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది.
దళారుల చుట్టూ ప్రదక్షిణలు..
బదిలీల కోసం సబ్‌రిజిసా్ట్రర్లు దళారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తోంది. వీలైతే కొందరు అధికారులు ఉదయం, సా యంత్రం దళారుల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్న ట్టు సమాచారం. దళారుల్లో కొందరు రిటైర్డు అధికారులు కూడా ఉండడంతో వారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు.
ముదిరి పాకానపడ్డ బదిలీలలు..
రిజిస్ర్టేషన్‌ శాఖలో బదిలీల వ్యవహారం ముదిరి పాకానపడింది. అధికారులు రెండు వర్గాలుగా చీలిపోయినట్టు సమాచారం. ఒక వర్గం బదిలీల కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తూ అధికార పార్టీ నాయకులతో సిఫార్సు చే యిస్తుండగా.. మరోవర్గం తాత్కాలికంగా బదిలీలను కొంతకాలం నిలబెట్టాలనే ప్రయత్నా ల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అధికారుల సం ఘానికి చెందిన కొందరు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులతో చర్చలు సాగిస్తు న్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం భారీగా వ సూళ్లు కూడా చేశారనే విమర్శలు ఉన్నాయి.ు24ఖ్కఈు24ఛిహాఊ్ణ+బ్జఏ్స్దబం,