Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 03:46AM

కాంగ్రెస్‌, టీడీపీ వాగ్వాదం

మడకశిర టౌన్‌: పట్టణంలోని రాజీవ్‌గాంధీ సర్కిల్లో నిర్మిస్తున్న నగర పంచాయతీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ వివాదం మళ్లీ మొదటి కొచ్చింది. ఒకటిన్నర నెల రోజుల కిందట మున్సిపాల్టీ పరిధిలో రాజీవ్‌గాంధీ సర్కిల్లో పాతదుకాణాలను తొలగించి కొత్తగా షాపింగ్‌ కాంప్లెక్స్‌నిర్మాణ పనులు ప్రారంభించారు. పనుల ుప్రారంభం నుంచే వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం ఆపాలని ఓ భవన యజమాని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ విషయంపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నగర పంచాయతీ వారు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పూర్తి చేసేందుకు పనులు ప్రారంభించడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. మాజీ ఎమ్మెల్యే కే.సుధాకర్‌, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ నరసింహమూర్తిలతో పాటు పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు షాపింగ్‌ కాంప్లెక్స్‌ ముందు ధర్నాకు దిగారు. అక్రమ కట్టడాలు ఆపాలని, మున్సిపల్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీనాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏక పక్షంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. కౌన్సిల్‌ల్లో తీర్మానం చేసి ఉన్నతాధికారుల అనుమతి పొందాల్సి ఉన్నా ఏ మాత్రం లేక్కచేయకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. మరో వైపుతెలుగు దేశం పార్టీనాయకులు, కౌన్సిలర్లు అక్కడకు రావడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు పరస్పర వ్యతిరేక నినాదాలు చేశారు. సీఐ హరినా థ్‌, ఎస్‌ఐ ధరణికిశోర్‌ అక్కడకు చేరుకుని మాజీ ఎమ్మె ల్యే సుధాకర్‌తోపాటు నాయకులతో మాట్లాడారు. సోమవా రం హైకోర్టులో విచారణ జరగనుందని, అంత వరకు ని ర్మాణాలను ఆపితీరాలని కోరడంతో, నిర్మాణ పను లు ని లుపుదల చేయిస్తామని సీఐ చెప్పడంతో వారు శాంతించారు. బ