Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 03:18AM

మెనోపాజ్‌కు ఇక సెలవు



- మహిళల్లో లైంగిక సామర్థ్యానికి ఇకపై ఫుల్‌స్టాప్‌ ఉండదు
- అండాశయానికి యాంటీ ఏజింగ్‌
- ఏకంగా అండాశయాన్నే పునరుత్పత్తి చేయొచ్చు
- కృత్రిమ అండాశయాన్నీ అమర్చొచ్చు
- మూలకణ థెరపీతో సాధ్యమే.. అమెరికన్‌ సైంటిస్టుల భరోసా

లండన్‌, సెప్టెంబర్‌ 21: మరణించే దాకా లైంగిక సామర్థ్యం పురుషుల సొంతం. అందరిలో అలా లేకున్నా, చాలా మంది పురుషులకు 75 ఏళ్ల వయసులోనూ లైంగిక సామర్థ్యం ఉంటుంది. అయితే.. ఆ సౌకర్యం స్ర్తీలకు ఉండదు. వారిలో చాలా మందికి 45 నుంచి 55 మధ్య వయసులో మెనోపాజ్‌ వచ్చేస్తుంది. అయితే.. వారు కూడా అరవైలో ఇరవైలా ఉండడం ఇకపై పెద్ద కష్టం కాదేమో? అరవయ్యే కాదు ఏ వయసులోనైనా, వారికి కూడా రొమాన్స్‌కు లోటు ఉండబోదని అమెరికన్‌ సైంటిస్టు ఒకరు భరోసా ఇస్తున్నారు. స్ర్తీలల్లో లైంగిక జీవితానికి మెనోపాజ్‌ రావడంతో ఫుల్‌స్టాప్‌ పడుతుంది. కొత్త అండాశయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, దాన్ని కామాగా మాత్రమే చేయొచ్చని తాజా పరిశోధనలు ఆశలు కల్పిస్తున్నాయి. మెనోపాజ్‌ రాకుండా చేయగలిగితే బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయి. మెనోపాజ్‌ను స్ర్తీల దరికి చేరకుండా చేయడం ద్వారా వారి లైంగిక జీవితాన్ని పెంపొందించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ముఖానికి, ఇతర భాగాలకూ లేదా శారీరక సౌష్ఠవానికి పరిమితమైన యాంటీ ఏజింగ్‌ చికిత్సలు ఇకపై శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపించొచ్చు. ఇతర అవయవాల బలహీనతలను తగ్గించినట్లే, మెనోపాజ్‌ను తగ్గించాలంటే, అండోత్పత్తి జరుగుతూనే ఉండాలి. అండాశయంలో పరిపక్వ అండాలు అయిపోతే అండోత్పత్తి జరగదు. అప్పుడు మహిళల్లో లైంగిక సామర్థ్యం పోయినట్లే. అయితే.. మూలకణ థెరపీ, కణజాల చికిత్స ద్వారా ఏకంగా కొత్త అండాశయాన్నే మహిళలకు అమర్చవచ్చని కాలిఫోర్నియాలోని సేన్స్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ సహ వ్యవస్థాపకుడు ఆబ్రే డి గ్రే చెబుతున్నారు. ముదిమి ప్రభావాన్ని తగ్గించి, వెయ్యేళ్లైనా బతికేయొచ్చని ఆయన గతంలో ప్రకటించారు. తాజాగా మెనోపాజ్‌ మహిళల జోలికి రాకుండా చేయొచ్చంటున్నారు.