Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 03:08AM

మేనిఫెస్టో అమలు చేయకుండా వస్తే టీఆర్‌ఎస్‌ ఎంపీ, ఎమ్మెల్యేలను నిలదీయండి

  కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌
మహబూబాబాద్‌, సెప్టెంబర్‌ 21 : ఎన్నికల మేనిఫెస్టో అమలు కోసం టీఆర్‌ఎస్‌ ఎంపీ, ఎమ్మెల్యేలను నిలదీయాలని కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాంనాయక్‌ పిలుపునిచ్చారు. ఉద్యమ సమయంలో తెలంగాణ తీసుకురాకుండా పల్లెలకు వచ్చే కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను నిలదీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ 100 రోజుల్లో ఏంచేశారో ప్రజలకు చెప్పాలన్నారు. మహబూబాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో దసరా తర్వాత నుంచి నిరాహార దీక్షలు చేస్తామని తెలిపారు.