Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 03:07AM

బాబును విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదు


విశాఖపట్నం, సెప్టెంబర్‌ 21(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని విమర్శించే నైతిక హక్కు అవినీతిపరుడు, స్వార్థపరుడైన వైసీపీనేత వైఎస్‌ జగన్మోన్‌రెడ్డికి లేదని మంత్రి పల్లె రఘునాఽఽథరెడ్డి అన్నారు. ఆదివారం విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అంతటి వ్యక్తికి పరుష పదజాలంతో దూషించడం సరికాదని, ఇకపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన జగన్‌... పరిపాలనాధక్షుడు, మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై అసత్య ప్రచారం మానుకోవాలని సూచించారు. పదేళ్లపాటు ముఖ్యమంత్రి, తొమ్మిదేళ్ల ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు 36 ఏళ్లు రాజకీయ చరిత్రలో ఎటువంటి ఆరోపణను ఎదుర్కొలేదన్నారు. అటువంటి నేతపై జగన్‌ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. రాష్ట్ర విడిపోవడానికి ఇద్దరు నేతలే కారణమని, వారిలో వైసీపీ నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఒకరుకాగా, మరొకరు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు కారకులని ఆరోపించారు. విభజన ద్వారా సీఎం పదవి చేపదవి చేపట్టి అవినీతి కేసుల నుంచి బయటపడడం, అక్రమంగా కూడగట్టిన ఆస్తులను పరిరక్షించుకోవడమే జగన్‌ ఆలోచనన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవి ద్యాలయం పేరు జయశంకర్‌ నామకరణం చేసే ప్రయత్నం, పోలవరం ముంపు గ్రామాల వివాదంలో, గవర్నర్‌కు శాంతిభద్రతలు అప్పగించిన వ్యవహారంలోను తెలంగాణ నిరసన వ్యక్తం చేసినా ఆంరఽధప్రదేశ్‌ ప్రతిపక్షనేతగా జగన్‌ నోరుమెదపలేదని ఆయన దుయ్యబట్టారు. దీనికి కారణం కేసీఆర్‌, జగన్‌ల మధ్య ఉన్న మిలాఖత్‌ రాజకీయాలే కారణమని ఆయన ఆరోపించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో సుమారు 120 మంది తెలుగుదేశం నేతలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎవరు పనికిమాలినవారో ఐదు కోట్ల మంది ప్రజలకు తెలుసని, ఈ కారణంగానే జగన్‌ను పక్కన బెట్టి తగిన గుణపాఠం చెప్పారని ఆయన దుయ్య బట్బారు. ఇకపైన తన ధోరణి మార్చుకోని పక్షంలో జగన్‌ తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందన్నారు.