Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Apr 10 2016 @ 03:33AM

నా బిడ్డలకు ‘భారత మాతాకీ జై’ పేరు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌... ‘భారత మాతాకీ జై’ నినాదం విషయంలో వివాదాస్పద తీరులో స్పందించారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘‘దేశమే సర్వశ్వం అని వాళ్లు అంటున్నారు. మీరు ‘భారత మాతాకీ జై’ అనాలి. అందుకే... నేను పెళ్లి చేసుకున్నాక ‘భారత మాతాకీ జై’ అని పేరు మార్చుకోవాల్సిందిగా నా భార్యకు సూచించాలనుకుంటున్నా. నా పేరు కూడా అలాగే మార్చుకుంటా. నా బిడ్డలకు కూడా ‘భారత మాతాకీ జై’ అని పేరు పెడతా. వాళ్లు స్కూల్‌కు వెళ్లినప్పుడు... మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటని టీచర్లు అడిగితే ‘భారత మాతాకీ జై’ అని అంటారు. ఆ విధంగా వాళ్లు ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండా ఉచితంగా చదువుకొంటారు’’ అని వ్యాఖ్యానించారు.