Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Apr 9 2016 @ 16:25PM

కేజ్రీవాల్‌పై షూ విసిరిన ఆమ్ ఆద్మీ సేన కార్యకర్త

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆమ్ ఆద్మీ సేనకు చెందిన కార్యకర్త ఒకరు షూ విసిరారు. బేసి-సరి వాహనాలను అనుమతించే ప్రయోగ రెండో దశపై కేజ్రీవాల్ విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది.షూ విసిరిన కార్యకర్తను ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కొట్టారు. ఆమ్ ఆద్మీ సేన కార్యకర్త విసిరిన షూ కేజ్రీవాల్ టేబుల్‌పై పడింది. కేజ్రీవాల్‌పై పడబోతుండగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది క్యాచ్ పట్టుకున్నారు.