Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Apr 9 2016 @ 01:29AM

పాఠ్యాంశాలుగా నాట్యకళలు: గంటా

  • చిత్రపరిశ్రమను విశాఖకు తరలించేందుకు చర్యలు : గంటా
  • రాజేంద్రప్రసాద్‌కు ‘బాపూ-రమణ’, ఆమనికి బాపూ-బొమ్మ పురస్కారం
చెన్నై, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): పాఠ్యాంశాల్లో నాట్యకళలు, యోగా, ధ్యానం వంటి వాటిని చేర్చనున్నట్టు ఏపీ మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన ఆధ్వర్యంలో చెన్నైలో శుక్రవారం జరిగిన దుర్మిఖి నామ సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నాట్యకళలు, యోగా వంటి వాటిని నేటితరం యువతకు తెలియజేసేలా పాఠ్యాంశాలుగా చేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు మంత్రి గంటా వెల్లడించారు. విశాఖను కల్చరల్‌ హబ్‌గా తయారు చేసే దిశగా కృషి చేస్తున్నామని, తెలుగు చిత్ర పరిశ్రమను విశాఖకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా.. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత సహకారంతో కలిసి విశాఖలో వరల్డ్‌ మ్యూజియంను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. త్యాగయ్య, అన్నమయ్య జయంతి వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకగా జరిపేందుకు నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రముఖ నటుడు, ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌కు ‘బాపు-రమణ’, ప్రముఖ నటి ఆమనికి ‘బాపు-బొమ్మ’ పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రచయిత వెన్నెలకంటితోపాటు పలువురు సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్త ఇందిరాదత, విద్యావేత్త డాక్టర్‌ పప్పు వేణుగోపాల్‌రావ్‌ తదితరులు పాల్గొన్నారు.