Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Apr 8 2016 @ 23:34PM

మైనింగ్‌ మాంద్యం దెబ్బకు ఇల్లమ్ముకుంటున్నాడు

బ్రిటన్‌ మైనింగ్‌ రంగం తీవ్రమాంద్యంతో అతలాకుతలం అవుతోంది. బడాబడా టాటా గ్రూప్‌ తన యుకె స్టీల్‌ వ్యాపారాన్ని విక్రయానికి పెట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా భారతీయ సంతతికి చెందిన బ్రిటన్‌ పారిశ్రామికవేత్త ప్రమోద్‌ అగర్వాల్‌ మోజుపడి కొనుక్కున్న ఇంటిని మాద్యం దెబ్బకు అమ్మకానికి పెట్టాడు. జమిన్‌ మైనింగ్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడైన ప్రమోద్‌ ఈ ఇంటిని 2013లో 3.75 కోట్ల పౌండ్లకు కొన్నాడు. బ్రెజిల్‌ గనిపై న్యాయపోరాటం, ధరల పతనంతో ప్రస్తుతం ప్రమోద్‌ ఇబ్బందుల్లో పడ్డట్లు తెలిసింది. అయితే ఆయన మాత్రం ఇది కేవలం తన వ్యక్తిగత అంశమని చెబుతున్నాడు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ప్రస్తుతం ఈ ఇల్లు కేవలం 3.2 కోట్ల పౌండ్లు మాత్రమే పలుకుతోంది.