desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 21 2014 @ 03:56AM

ఆరోగ్య కేంద్రాలకు ఫీవర్‌..
కనిగిరి: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యసేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. కనిగిరి నియోజకవర్గంలో ఈ పరిస్థితి తీ వ్రంగా ఉంది. పామూరులో ఓ సామాజిక ఆరో గ్యకేంద్రం, ఆరు మండలాల్లో ఆరు ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 53 ఉ పకేంద్రాలు ఉన్నాయి. పేరుకే తప్ప ఎటువంటి వైద్యసేవలు వాటిల్లో అందడం లేదు. మందులు కొరత తీవ్రంగా ఉంది. ఏదో నామమాత్రంగా మినహా అవసరమైన మందులు పీహెచ్‌సీలో అ ందుబాటులో లేవు. దీంతో మెడికల్‌ షాపుల్లో రో గులు మందులు కొనుగోలు చేస్తున్నారు. ఏ వ్యా ధులు వచ్చినా ప్రయివేట్‌ ఆసుపత్రులకు ప్రజ లు వెళ్ళాల్సి వస్తోంది. అన్నీ వసతులు ఉన్నా ఏ ఒక్క పీహెచ్‌సీలోను ఆపరేషన్లు జరిగిన పా పాన పోవడం లేదు. కనీసం జ్వరాలు సోకిన వారికి ఏ రకమైన జ్వరమో తెలిపే నిర్ధారణ పరీ క్షలు కూడా నోచుకోని పరిస్థితి నెలకొంది.
రెండు పీహెచ్‌సీల్లో డాక్టర్లు నిల్‌
ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలు పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. భవనాలు వసతులు ఉన్నా డాక్టర్లు కొరత పట్టి పీడిస్తున్నది. రెండు పీహెచ్‌సీల్లో డాక్టర్లు లేరు. కనిగిరి మండలంలో ని గురవాజిపేట పీహెచ్‌సీలో ఉన్న ఒక్క డాక్టర్‌ గత 15 రోజులు క్రితం దీర్ఘకాలం సెలవుల్లో వె ళ్లారు. అక్కడ కనీసం ఇన్‌చార్జి డాక్టర్‌ను సైతం ఏర్పాటు చేయలేదు. దీంతో కనీసం రోజువారీగా వచ్చే రోగులను చూసేవారు లేరు. అలాగే సీయస్‌పురం పీహెచ్‌సీలో గతంలో ఉన్న డాక్టర్‌ రాజీనామా చేసి వెళ్లగా మరో డాక్టర్‌ను నియమించలేదు. పామూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌ ము రళిని ఇన్‌చార్జిగా నియమించారు. పీసీపల్లి ప్రా థమిక ఆరోగ్యకేంద్రంలో ముగ్గురు డాక్టర్లు ఉం డాల్సి ఉండగా ఇద్దరు ఉన్నారు. గతంలో ఈ ఆ రోగ్యకేంద్రంలో ఆపరేషన్లుకు అవసరమైన అన్నీ వసతులు కల్పించారు. అయితే గత కొన్నేళ్ళుగా ఆపరేషన్లు జరగక మంచాలు, సామగ్రి తుప్పు పట్టి పిచ్చిమొక్కలుతో ఆవరణ నిండిపోయింది. మండలంలో ఏ చిన్న అనారోగ్యం కల్గినా కనిగిరి వెళ్లాల్సిందే.
కనిగిరి అర్బన్‌ ప్యామిలీ వెల్ఫేర్‌ సెంటరుకు, ఎస్‌పీహెచ్‌వోకు హనుమంతునిపా డు పీహెచ్‌సీ డాక్టర్‌ అదనపు బాద్యతలు నిర్వహిస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలోని 53 ఆ రోగ్య ఉపకేంద్రాలు ఉండగా 15 కేంద్రాల్లో వై ద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గర్భిణిలు, బాలింతలుతో పాటు సీజనల్‌ వ్యాధులు వచ్చిన సమయంలో వీరు కీలకంగా ఉంటారు. ఈ పోస్టులు ఖాళీగా ఉండటంతో వై ద్యసేవలు గ్రామాల్లో అడుగంటాయి. పామూరు మండలం బొట్లగూడూరులో నూతన పీహెసీ మంజూరు చేసి, రూ.50 లక్షలతో భవనాలు ని ర్మించి ఏడాది కావస్తున్నా సిబ్బంది నియామకం జరుగక నిరుపయోగంగా తయారైంది.
వసతుల కరువు
పీహెచ్‌సీలకు, ఆరోగ్య ఉపకేంద్రాలకు భవనా లు, సిబ్బంది కొరత పీడిస్తోంది. జిలాల్లో 535 ఆ రోగ్య ఉపకేంద్రాలు ఉండగా 84కేంద్రాలకు మా త్రమే పక్కా భవనాలు ఉన్నాయి. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 53 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా ఆరు కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా మిగిలినవి అద్దెభవనాలు లేదా అంగన్‌వాడీ కేంద్రాలు, పౌష్టికాహార కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఉప కేంద్రాలకు ప్రభుత్వం అద్దె నెలకు రూ.250 ఇస్తారు. ఇంత తక్కువ మొత్తానికి అద్దెలకు కనీసం చిన్న గది కూడా దొ రకదు. దీంతో సిబ్బంది విధులు నిర్వహించడం కష్టంగా మారింది. భవనాలు ఉన్న చోట సి బ్బంది నియామకం జరుగక వైద్యసేవలు అం దక మూతబడుతున్నాయి. గతంలో ఉపకేంద్రా ల నిర్వహణకు ఏడాదికి రూ.10వేలు కేటాయించేవారు. దీంతో ఫర్నిచర్‌, స్టేషనరీ, విద్యుత్‌ బిల్లులు, వైద్యపరికరాలు కొనుగోలు చేసేవారు. ఈ ఏడాది రూ.1100 తగ్గించారు. దీంతో మరి ంత ఇబ్బందులు పడుతున్నారు. గురవాజిపేట పీహెచ్‌సీకి సంబంధించిన ఫ్యామిలీ ప్లానింగ్‌ కేంద్ర భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఏ క్షణ మైనా కూలే పరిస్థితి ఉండగా సిబ్బంది బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. నిత్యం సిబ్బం దితో సమావేశాలు జరుగుతుంటాయి. వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి పిల్లలు వస్తుంటారు. శిథిల మైనా ఈ భవనంలోనే కార్యకలాపాలు సాగించ డం ప్రమాదకరంగా మారింది. ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాలు ఉన్నా వైద్య సేవలు అందడం లే దు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి ఆరోగ్యసేవలు అందేలా చ ర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.